గ్రామ రెవెన్యూ సహాయకులకు తెలంగాణ తరహాలో పేస్కేల్ వేతనాలు అమలు చేయాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పాత గుంటూరులోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 8 సంవత్సరాలుగా గ్రామ రెవెన్యూ సహాయకులకు వేతనాలు పెంచకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.