చుంచుపల్లి మండలం పెనగడప గ్రామపంచాయతీకి చెందిన పలువురు బుధవారం సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎస్ కె సాబీర్ పాషా సమక్షంలో సిపిఐలో చేరారు. కొత్తగూడెం'సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్'లో వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు, పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్ని అందించారు. ఈ సందర్బంగా సాబీర్ పాషా మాట్లాడుతూ నియోజకవర్గంలో సిపిఐ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతోందని అన్నారు..