పండుగ పూట విషాదం చోటుచేసుకున్న ఘటన బుధవారం ఉదయం 9:00 లకు వెలుగులోకి వచ్చింది..మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలం విరారం గ్రామానికి చెందిన 23 ఏళ్ల మునేశ్ కుటుంబంతో కలిసి తిరుమలాయపాలెం మండల రాకాసితండా సమీపం వెళ్లివస్తూ అకేరు వంతెన వద్ద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆటో బురదలో ఇరుక్కుపోవడంతో కుటుంబ సభ్యులు లాగేందుకు ప్రయత్నిస్తుండగా అతడు వంతెనపై నుంచి దూకినట్లు సమాచారం. రాత్రి గాలింపు విఫలమవగా, బుధవారం కూడా ఆచూకీ లభించలేదు. అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.