గంజాయి, హాశ్ ఆయిల్ను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నా ముగ్గురు వ్యక్తులను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద 10 కిలోల గంజాయి, 2 కిలోల హాశ్ ఆయిల్, ద్విచక్రవాహనం, రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులతో పాటు సిబ్బందిని డీసీపీ అభినందించారు.