నల్లరాయి క్వారీలో బ్లాస్టింగ్ వల్ల అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోగల రోలుగుంట మండలం శరభవరం పంచాయతీ రాజన్నపేట గ్రామంలోని ఇళ్లు బీటలు వారుతున్నాయని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు అన్నారు. సోమవారం గ్రామంలోని బీటలు వారిన ఇళ్లను పరిశీలించి మాట్లాడారు. ఇక్కడ ఇళ్లు బీటలు వారుతున్నాయని గ్రామస్థులు ఆర్డీవో, కలెక్టర్కు ఫిర్యాదు చేశారని, దీంతో మైనింగ్ అధికారులు వచ్చి ఇక్కడ ఎటువంటి బ్లాస్టింగ్ జరగలేదని చెప్పడం సరైంది కాదన్నారు.