చీరాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం,అత్యవసర సమావేశం శుక్రవారం వెంట వెంటనే జరిగాయి.సాధారణ సమావేశంలో 29 అంశాలతో కూడిన అజెండాను ప్రవేశపెట్టగా ఒక్క అంశం మినహా అన్నీ కౌన్సిల్ ఆమోదం పొందాయి. అలాగే అత్యవసర సమావేశంలో కుందేరు లో గుర్రపు డెక్క తొలగింపునకు 40 లక్షల కేటాయించాలన్న ఎమ్మెల్యే కొండయ్య ప్రతిపాదనకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.సభకు మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు అధ్యక్షత వహించారు.