పోలీసు సిబ్బంది తమ సమస్యలను నిర్మోహమాటంగా తనకు తెలియజేయాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పోలీసులకు సూచించారు, శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమం నిర్వహించి పోలీసుల నుండి విజ్ఞాపనలు స్వీకరించారు, వారి సమస్యలను వ్యక్తిగతంగా విని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.