నల్గొండ జిల్లా కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా కేంద్రంలో ఈనెల 17న వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవ సభను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సభకు సిపిఎం మాజీ పాలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ హాజరు కానున్నట్లు తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి తో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారని పాలడుగు నాగార్జున పేర్కొన్నారు.