గత వారం రోజుల క్రితం అదృశ్యమైన నర్సాపురం MPDO వెంకట రమణారావు ఆచూకీ కోసం చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ ఫలించిందని కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధరరావు తెలిపారు. ముందు నుండి అనుమానించినట్టుగానే ఎంపీడీఓ ఆత్మహత్య చేసుకున్నారని.. ఆయన మృతదేహం మధురానగర్ వద్ద ఏలూరు కాలువలో గుర్తించడం జరిగిందన్నారు.