ఉల్లి రైతు కంట కన్నీరు.మూడు రోజుల క్రితం కురిసిన వర్షాల కారణంగా ఉల్లి రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు.ఉల్లికి కనీస మద్దతు ధర లేకపోవడంతో పంటను కొనేవారు లేక పొలాల్లోనే వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని గోనెగండ్లకు చెందిన మహిళా రైతు లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తే చేతికొచ్చిన సమయానికి పంట వర్షానికి నాని నష్టాలు మిగిల్చిందని వాపోయారు.