తెలుగు భాషా సంస్కృతులను విశ్వవ్యాప్తం చేసేందుకు మండలి వెంకట కృష్ణారావు చేసిన కృషి అనితర సాధ్యమైనదని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొనియాడారు.చెన్నైలో ఆదివారం జరిగిన మండలి వెంకట కృష్ణారావు శతజయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.మంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించిన ఘనత మండలిదేనని ఎంపీ చెప్పారు.అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్,ప్రముఖ సినీ రచయిత భువనచంద్ర తదితరులు పాల్గొన్నారు.