నల్గొండ జిల్లా, మాడుగులపల్లి మండలంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ..రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణా అడ్డుకునేందుకు జిల్లాలో ప్రత్యేక పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చెక్పోస్టుల వద్ద 24 గంటలు పోలీస్ సిబ్బంది పర్యవేక్షిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా పశువులను అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు