నరసాపురంలో వశిష్ఠ గోదావరి నది ఉరకలు వేస్తూ ప్రయాణిస్తోంది. ధవళేశ్వరం వద్ద 2 వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఎప్పుడు రద్దీగా ఉండే వలందర రేవు బోసిపోయింది. అయితే గోదావరి ప్రవాహం చూడటానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు. వలందర రేవు వద్ద బారికేడ్లు దాటి గోదావరి ఉరకలు వేస్తోంది. ఆచంట మండలం భీమలాపురం వద్ద గోదావరి వరద ప్రవాహం ఉరకలేస్తుంది. పుష్కర ఘాట్ పైకి వరద ప్రవాహం చేరుకుంది. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.