రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన వివిధ రెవెన్యూ అంశాలపై జిల్లాలోని డివిజన్, మండల స్థాయి రెవిన్యూ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రీ సర్వే,22 ఏ,అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, పి జి ఆర్ ఎస్ ఫిర్యాదులు, రైస్ కార్డులు,క్యాస్ట్ వెరిఫికేషన్, కోర్టు కేసులు అంశాలపై జిల్లాలోని ఆర్డీవోలు,తహసిల్దారులు మండల సర్వేలతో సమీక్షించారు.