బూర్గంపాడు మండల పరిధిలోని చెరువు సింగారంలో అడవి శాఖ అధికారులు ధ్వంసం చేసిన పత్తి పంటకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. కాసులమ్మ అనే ఆదివాసి గిరిజన మహిళకు చెందిన నాలుగు ఎకరాల పత్తి చేనును ఫారెస్ట్ అధికారులు పీకి వేశారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు..