నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండడంతో వరద ప్రభావం పెరిగింది. దీంతో అధికారులు 16 క్రస్ట్ గేట్లను ఐదు ఫీట్ల మేర పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సాగరకు ఎగువ నుండి 1,77,137 టీఎంసీల నీరు వస్తుండగా, 1,70757 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు చేరుకుంది. ఉచిత నీటి నిలువ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను పూజిస్తాయి నీటి సామర్థ్యానికి చేరుకుంది.