రెండు రోజులుగా పడుతున్న వర్షాలతో నరసాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో గల అమ్మకచెరువు అలుగు పారడంతో మాజీ సర్పంచ్ రాజేందర్ రైతుల ఆధ్వర్యంలో అలుగు వద్ద బుధవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మకచెరువు అడుగు పాడడంతో రైతులకు పోరాట కలగడమే గాక ఖరీఫ్ రవి పంటలకు గాను గ్రౌండ్ వాటర్ పెరిగి బోరు బావులు సమృద్ధిగా వాటర్తో ఉంటాయని గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నవీన్ గుప్తా వనమాల రాములు కర్రలు విట్టల్ తదితరులు పాల్గొన్నారు.