గంగవరం: చిన్నూరు వంకాయల చెరువు గ్రామస్తులు మీడియాతో మాట్లాడారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు చిట్టిబాబు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి అడ్డు అదుపు లేకుండా చెరువుని కబ్జా చేసుకుని మరి, అక్రమంగా మట్టిని జెసిబి ట్రాక్టర్లతో తవ్వి ధనార్జనే ద్యేయంగా విర్రవీగుతున్నాడని ఆరోపించారు. ఇదేంటని ప్రశ్నిస్తే మీ దిక్కున చోట చెప్పుకోమని బెదిరిస్తున్నాడు అందుకేనా మేము ఓట్లేసి గెలిపించింది. ఇంతవరకు ఒక్క పథకం గురించి మాకు వివరించలేదు బీదా సాదా కి ఒక మేలు జరగలేదన్నారు.