మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం మధ్యాహ్నం హెచ్ఎంఎస్ 26వ ద్వైపాక్షిక మహాసభను నిర్వహించారు .ఈసందర్భంగా ఇందారం ఎక్స్ రోడ్ నుండి నస్పూర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు సురేష్ నేత పాల్గొన్నారు. కార్మిక సంఘం నాయకులు రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ రాజకీయ నాయకుల పలుకుబడి పెరిగిపోవడంతో సింగరేణి సంస్థ మునిగిపోయే దశకు వచ్చిందని దానిని కాపాడుకోవాలంటే ఐక్య ఉద్యమాల వల్లే సాధ్యమవుతుందన్నారు. కార్మికుల హక్కులను కాలరాయకుండా ఉండి కోల్పోయిన హక్కులను తిరిగి సాధించాలన్నారు