నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆదివాసి యువకుడు పట్టుదలతో, ఏకాగ్రతతో మొక్కవోని దీక్షతో ప్రభుత్వ పాఠశాలలో చదివి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యం ఏ హిస్టరీలో సీటు సంపాదించిన పాయం కాంతారావు తోటి విద్యార్థులకు స్ఫూర్తి నింపడానికి మార్గదర్శకుడిగా నిలవడం చాలా సంతోషమని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ అన్నారు.శనివారం నాడు తన చాంబర్లో దుమ్ముగూడెం మండలం తాటివారిగూడెం గ్రామానికి చెందిన పాయం కాంతారావు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎం ఏ హిస్టరీలో సీటు సంపాదించాడని ఆయన అన్నారు