ములుగు జిల్లా ఎటునాగారం జడ్పీహెచ్ఎస్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలు నిరుపయోగంగా మారుతున్నాయని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు వాపోతున్నారు. వాకర్స్ సౌకర్యం కోసం లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసినా ఓపెన్ జిమ్ పరికరాల కింద బేస్మెంట్ సరిగా నిర్మించకపోవడంతో అధ్వానంగా మారాయి అన్నారు. చెత్తాచెదారం బురదతో కూలిపోయేలా ఉన్నాయని వార్తలు తెలిపారు మరమ్మత్తులు చేపట్టి దుర్వినియోగం కాకుండా చూడాలని వీటి మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే ఇలా తయారయ్యాయని వారు వాకర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.