ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య బోధన విద్యార్థులకు అందుతుందని ప్రధానోపాధ్యాయులు పోగుల రాజేంద్రప్రసాద్ అన్నారు. సోమవారం మద్దిరాల మండలం చౌళ్లతండాలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్, మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ అందుతాయన్నారు.