కనిగిరి పట్టణంలోని గార్లపేట రహదారిలో అక్రమంగా తరలిస్తున్న 232 బస్తాల రేషన్ బియ్యం వాహనాన్ని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, CITU, ప్రజా సంఘాల నాయకులు గురువారం తెల్లవారుజామున అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వాహనం ఎదుట వారు ఆందోళన చేపట్టారు. కనిగిరిలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదన్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.