అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బసినేపల్లి గ్రామ శివారులో క్యారమ్ బోర్డు అడే విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకొని ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గుత్తి పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి మండలంలోని బసినేపల్లి గ్రామానికిచెందిన కంబయ్య, రాజు, సుధాకర్ అనే యువకులు గ్రామ శివారులోని టీకేఫ్ వద్ద రోజు చెట్నేపల్లి గ్రామానికి చెందిన మౌలి. రాజేష్, రామంజి, బాలు, రమేష్, శేఖర్ తో కలిసి క్యారమ్ బోర్డు అడేవారు. చిన్నపాటి విషయంపై గురువారం రాత్రి గొడవ జరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు.