మెట్రో రైలు మరోసారి ప్రాణరక్షక పాత్ర పోషించింది. మంగళవారం రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య విరాళంగా లభించిన హృదయం, ఊపిరితిత్తులు అత్యవసరంగా తరలించారు. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి యశోద ఆసుపత్రి (పరేడ్ గ్రౌండ్స్) వరకు హృదయాన్ని 11 కి.మీ. దూరం 16 నిమిషాల్లో, మాదాపూర్ యశోద ఆసుపత్రికి ఊపిరితిత్తులను 27 కి.మీ. దూరం 43 నిమిషాల్లో 21 స్టేషన్లను దాటి వెంటనే చేర్చారు.