వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో ఉన్న భద్రకాళి ఆలయంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇద్దరు ధర్మకర్తలను ఎమ్మెల్యే నాయుడు రాజేందర్ రెడ్డికి తెలియకుండా నియమించారు. ఇది కాస్త ఇప్పుడు మంత్రి ఎమ్మెల్యే మధ్య మళ్లీ చిచ్చు రేపింది. దీంతో ఎమ్మెల్యే నాయిని ఈరోజు మాట్లాడుతూ మంత్రి తన లిమిట్స్ లో తాను ఉండాలని నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు చెప్పాల్సిపోయి యేలు పెట్టడం కరెక్టు కాదని ఆయన ఘాటుగా స్పందించారు. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు.