విషం తాగి వివాహిత ఆత్మ హత్యా యత్నం భర్త రోజూ మధ్యం తాగి ఇంటికి వస్తున్నాడని మనస్థాపంతో ఓ వివాహిత విషం తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడి, మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో చేరింది. పోలీసుల కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా, బి కొత్తకోట మండలం, మొటుకు గ్రామం, పులుసుమానుపెంటకు చెందిన శివశంకర భార్య లక్ష్మీదేవి(36) రోజు పీకలదాకా మద్యం తాగి భర్త ఇంటికి వస్తుండడంతో తాగి ఇంటికి రావద్దని భర్తను మందలించింది. దీంతో భర్త భార్యపై గొడవ పడడంతో మనస్థాపం చెంది ఇంట్లో ఉన్న పురుగుమందుతాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కుటుంబీకులు బాధితురాలని వెంటనే మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు