కనిగిరి మున్సిపాలిటీలో వీధి కుక్కల బెడద నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ పెళ్లి కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ఇది కుక్కలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక టీములను ఏర్పాటు చేసినట్లు శుక్రవారం ఆయన తెలిపారు. కనిగిరిలోని దేవాంగ నగర్, కాశిరెడ్డి కాలనీ, పాతూరు , టకారి పాలెం తదితర ప్రాంతాలలో శుక్రవారం వీధి కుక్కల పట్టివేత కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ స్వయంగా పర్యవేక్షించారు. పట్టుకున్న వీధి కుక్కలను నల్లమల అటవీ ప్రాంతంలో వదిలేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. పెంపుడు కుక్కల యజమానులు వాటికి వ్యాక్సిన్లు వేయించి, ఇళ్లలో ఉంచుకోవాలని కమిషనర్ సూచించారు.