యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ముందు సోమవారం ఉదయం త్రిబుల్ ఆర్ భూ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో ఎమ్మెల్సీ నెల్లికంట్టి సత్యం, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు గొంగిడి మనోహర్ రెడ్డి, సిపిఐ జాతీయ నాయకులు పల్లా వెంకటరెడ్డి లతోపాటు చౌటుప్పల్, నారాయణపూర్ మండలాలకు చెందిన త్రిబుల్ ఆర్ భూబాధితులు పెద్ద ఎత్తున పాల్గొనగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నాలుగంచెల భద్రత ఏర్పాటు చేశారు. భూపాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని పలువురు హెచ్చరించారు.