నల్గొండ జిల్లా, కనగల్ మండలం, రేగట్ట గ్రామానికి చెందిన బొడ్డు అనిత, శంకర్ దంపతులకు పుట్టుకతోనే దివ్యాంగుడిగా నిరంజన్ అనే కుమారుడు జన్మించాడు. నిరుపేద కుటుంబానికి చెందినవారు కూలి చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. కాగా పూట గడవడం కష్టంగా ఉందని మంగళవారం సాయంత్రం వారు మాట్లాడుతూ.. తమ కుమారునికి 100% అంగవైకల్యం ఉన్నప్పటికీ గతంలో పెన్షన్ వచ్చేదని, దానిని మధ్యలోనే నిలిపివేశారని, అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పూట గడవడం కష్టంగా ఉందని దయచేసి తన కుమారునికి పెన్షన్ ఇప్పించి ఆదుకోవాలని కోరారు.