వరంగల్ నగరంలోని డాల్ఫిన్ హోటల్ గల్లీలో షాపులను బంద్ చేసి మార్వాడీలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ వ్యాపారస్తులు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు స్థానిక వ్యాపారస్తులు. నకిలీ వస్తువులు సర్కులతో కల్తి వ్యాపారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు. మోసపూరిత వ్యాపారం ఆపి ఇకనుండి వెళ్ళిపోవాలంటూ ఈ సందర్భంగా స్థానిక వ్యాపారస్తులు డిమాండ్ చేశారు.