నల్గొండ జిల్లా, త్రిపురారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ముందు యూరియా కోసం రైతులు శనివారం సాయంత్రం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎరువుల పంపిణీలో జాప్యం, సరైన నిల్వలు లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తమకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ యూరియా కొరత వల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.