అరియర్ బిల్లులను ఖజానాకు సమర్పించుటకు గడువు పొడిగించాలని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు కోరారు. గురువారం సాయంత్రం జిల్లా ఖజాన కార్యాలయంలో ఉప సంచాలకులు వెంకటేశ్వర్లు ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పాలెం మహేష్ బాబు మాట్లాడుతూ అరియర్ బిల్లులు సమర్పించుటకు ప్రతి నెల ఆరో తేదీ నుండి పదవ తేదీ వరకు గడువు ఉండేదని అయితే ఈనెల కొన్ని అనివార్య కారణాల వల్ల 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు గడువు పొడిగిస్తామని చెప్పినప్పటికీ పదవ తేదీతోనే ఆన్లైన్లో గడువు ముగిసినట్లుగా చూపుతున్నారని తెలిపారు.