నల్గొండ మండలం, ఖాజీరామారం గ్రామంలో విద్యుత్ షాక్ తో రెండు మేకలు మృతి చెందాయి. ఆదివారం మధ్యాహ్నం బాధితుడు కుందారపు లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రోజువారి మాదిరిగా తన గొర్రెలను, మేకలను మేతకు తోలుకెల్లాగా, ఊరి చివరలో విద్యుత్ స్తంభానికి ఉన్న బూస్టర్ నుండి ఎర్త్ తగిలి మేకలు మృతి చెందినట్లు తెలిపారు. మృతి చెందిన మేకల విలువ సుమారు రూ.20 వేలు ఉంటుందని, ఇష్ట పోయిన తనను విద్యుత్ అధికారులు ఆదుకోవాలని బాధితుడు లింగయ్య కోరాడు.