Download Now Banner

This browser does not support the video element.

మోత్కూర్: బుజిలాపురం గ్రామంలో విషాదం, మతిస్థిమితం సరిగా లేక బావిలో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుని మృతి

Mothkur, Yadadri | Aug 31, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బుజిలాపురం గ్రామానికి చెందిన కాసగాని సరిత (35) అనే వివాహిత ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి భర్త కాసగాని వెంకన్న, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. మృతురాలికి గత కొన్ని నెలలుగా మానసిక స్థితి సరిగ్గా లేదని బంధువులు, స్థానికులు తెలిపారు. కాగా ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకుని పోలీసులు ఆత్మహత్యనా..? లేక మరేమైన ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
Read More News
T & CPrivacy PolicyContact Us