పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలో మంగళవారం భక్తులకు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కంట్రోల్ బోర్డ్ ఏఈ భాస్కర్ వర్మ మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా ఏటా ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ వాడకం వినియోగం వలన క్యాన్సర్ పెరిగే అవకాశం ఉందని దానిలో కలిపే రంగులు ప్రమాదకరమని తెలిపారు. భక్తులు తప్పనిసరిగా మట్టి గ్రహాలు నియోగించి నీటి పొల్యూషన్ కాకుండా కాపాడాలని ఆయన కోరారు.