ఎల్లారెడ్డి : హైదరాబాదు కూకట్ పల్లి కోర్టు పరిధిలో విధుల్లో భాగంగా కక్షిదారులతో పాటు న్యాయవాది తన్నీరు శ్రీకాంత్, కోర్ట్ బెలీఫ్ సివిల్ కేసులో కోర్ట్ వారెంటు అమలు పరచడానికి వెళ్లడం జరిగింది. వృత్తిలో భాగంగా వారంట్ అమలు కోసం వెళ్లిన న్యాయవాదిపై కొంతమంది అరాచకవాదులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీద్ ఆధ్వర్యంలో కోర్టు ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో న్యాయం అందించే న్యాయవాదులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదులకు తప్పనిసరిగా రక్షణ కల్పించాలని తెలిపారు.