27వ తేదీ బుధవారం వినాయక చవితి సందర్భంగా, పూజలు నిమిత్తం ఏర్పాటు చేసేటువంటి, వినాయక విగ్రహాలను, మట్టితో తయారుచేసినవి పూజలకు ఉపయోగించాలని కోరుతూ, పెద్దాపురంలోని విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారుచేసినటువంటి విగ్రహాలు. నిమజ్జనం సమయంలో నీటిలో త్వరగా కరగకపోవడం వల్ల, నీటి కాలుష్యం భూమి కాలుష్యం, అవుతుందని దీనివల్ల వాతావరణం పూర్తిగా కలుషితమవుతుందని, విద్యార్థులు అవగాహన ర్యాలీ కల్పించారు, అదేవిధంగా మట్టి విగ్రహాలను వాడటం వల్ల కలిగే ఉపయోగాలను. చిన్నారులు చక్కగా వివరించారు.