Kandukur, Sri Potti Sriramulu Nellore | Aug 26, 2025
కందుకూరులో గుట్టుగా సాగుతున్న పేకాట శిబిరంపై టౌన్ పోలీసులు మంగళవారం ఆకస్మిక దాడి చేశారు. కోవూరు రోడ్లోని ఓ నివాసంలో నలుగురు జూదరులను అదుపులోకి తీసుకుని రూ. 12,250 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ శివనాగరాజు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో తెలిపారు. స్థానికులు అందించిన సమాచారంతో దాడి చేశామని, అసాంఘిక కార్యకలాపాల గురించి సమాచారం అందించాలని ఆయన కోరారు.