కామారెడ్డి లో వరద సమయంలో అధికారులతో పాటు తాను కూడా క్షేత్రస్థాయిలోనే ఉన్నానని.. పనిచేసే వారి పట్ల దుష్ప్రచారం తగదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. కామారెడ్డిలో 15 సెంమీ వర్షం పడుతుందని, ఫలితంగా వరదలు వస్తాయని ఎవరు ఊహించలేదన్నారు. ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని తెలిపారు. పండగ రోజు ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండటంతో ప్రాణనష్టం జరగలేదన్నారు. 30మీటర్లు ఉన్న వాగు ప్రవాహం 300మీటర్లు పారిందని, ఒక చెరువు కెపాసిటీ నాలుగు చెరువులను నింపేంత ఓవర్ఫ్లో అయిందన్నారు.