కరీంనగర్ జిల్లా,చొప్పదండి లో ప్రమాదవశాత్తు వృద్ధురాలు బావిలో పడిన ఘటన సోమవారం మధ్యాన్నం 2 PM కి చోటుచేసుకుంది,స్థానిక 13వ వార్డుకు చెందిన పంచల భాగ్యలక్ష్మి అనే వృద్ధురాలు తన ఇంటి వెనకాల ఉన్న చేదబావి దగ్గరికి వెళ్లి నీళ్లు తోడుకుంటుండగా ప్రమాదవశాత్తు చేదబావిలో పడిపోయింది,వృద్ధురాలి కుటుంబ సభ్యులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో,ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెస్క్యూ టీం సహాయంతో అతి కష్టం మీద తాళ్ల సహాయంతో వృద్ధురాలని బావిలో నుండి బయటకు తీశారు,హుటాహుటిన భాగ్యలక్ష్మి పరిస్థితి విషమించడంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు,