గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయని తెలుసుకున్న వైసీపీ నాయకులు గురువారం గ్రామంలో పర్యటించారు. ఈ గ్రామంలో 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్నవారు చనిపోతున్నారని, మంచినీటి సరఫరా సరిగ్గా లేకపోవడం, చెరువు నీటిని వాడటం వల్లే ఈ మరణాలు సంభవిస్తున్నాయని నాయకులు ఆరోపించారు. బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు రాంబాబు పేర్కొన్నారు. మృతి చెందిన కుటుంబాలకు పరిహారం ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.