చీరాలలో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో చైన్ స్నాచింగ్ జరిగింది. బ్రహ్మంగారి చెట్టు సమీపంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న ఒక మహిళను ద్విచక్ర వాహనంపై వెంబడించిన ఒక వ్యక్తి ఆమె మెడలో నుండి చైన్ లాక్కొని స్పీడ్ గా వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న వన్టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దాదాపు నాలుగు సవర్ల చైన్ పోయిందని బాధితురాలు తెలిపింది.పూర్తి వివరాలు అందాల్సి ఉంది.