పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంకలో వరద బాధితులను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు శనివారం పరామర్శించారు. కూటమి ప్రభుత్వం కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వటం లేదు అని అయిన దగ్గర బాధితులు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద ముంపు గ్రామాల ప్రజలు వరద ప్రభావం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, పశువులకు దాణా ఏర్పాటు చేసి, గ్రామంలో శానిటేషన్ మెరుగుపరిచి, ప్రజలకు వైద్య సహాయం, మంచినీళ్లు, పాలు, ఆహారం వంటివి వెంటనే అందించాలన్నారు. మండల అధ్యక్షుడు ఉచ్చుల స్టాలిన్, ఎంపీపీ ధనలక్ష్మి రవి తదితరులు పాల్గొన్నారు.