అశ్వారావుపేట మండల కేంద్రంలో మంగళవారం యూరియా కోసం ఓ రైతు గంటల తరబడి నిలబడి స్పృహ తప్పి పడిపోయాడు.గుమ్మడివల్లి గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణ యూరియా కోసం వచ్చి నారాయణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద తెల్లవారిజాము 5 గంటల నుండి నిల్చోవడంతో సొమ్మసిల్లి పడిపోయాడు.పక్కన ఉన్న రైతులు మంచినీళ్లు తాగించారు.చెవిలో నుండి రక్తము రావడంతో అనంతరం దెగ్గరలో ఉన్నా హాస్పిటల్ కు తరలించారు..మూడు ఎకరాలు ఉన్నా రైతుకు ఒక్క బస్తానే యూరియా ఇవ్వడం చాలా దారుణమని రైతులు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.