వినాయక నిమజ్జనానికి తరలి వెళ్తున్న వాహనాన్ని మళ్లింపు మార్గంలో వెళ్లాలని సూచించిన ట్రాఫిక్ పోలీసులపై కొందరు యువకులు దాడి చేసిన ఘటన ఒంగోలులో ఆదివారం రాత్రి జరిగింది. మారుతీ నగర్ కు చెందిన వినాయకుని విగ్రహం నిమజ్జనానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు పోలీసులే తమపై దాడి చేశారంటూ యువకులు ఆందోళనకు దిగారు. సీనియర్ పోలీస్ అధికారులు రంగ ప్రవేశం చేశారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది