హనుమకొండ లో రైతులను యూరియా కొరత వెంటాడుతుంది. హసన్పర్తి ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద రైతులు ఉదయం నుంచి యూరియా కోసం ఉదయం నుండి లైన్లో వేచివున్న అధికారులు కొంతమందికే యూరియా బస్తాలు ఇచ్చారు. మిగిలిన రైతులకు యూరియా బస్తాలు లేవని రైతులను వెనక్కి పంపించడంతో ఉదయం నుంచి పడికాపులు కాస్తే ఇప్పుడు లేవని చెప్పడమేంటని రైతులు ఆందోళన చేపట్టారు. వరి నాటు వేసి నెలరోజులు అవుతున్న యూరియా చల్లలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులకు సరిపడా యూరియా బస్తాలు అందించాలని డిమాండ్ చేశారు.