వరంగల్ జిల్లా ఖానాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 763 కిలోల మూడు కోట్ల 80 లక్షల విలువచేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం మధ్యాహ్నం నాలుగున్నర గంటలకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. అందులో భాగంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని మరో నలుగురు నిందితులు పారారులో ఉన్నట్లు ఆయన తెలిపారు.