కొమురవెల్లి మండలంలోని తపాస్ పల్లి రిజర్వాయర్ ను జిల్లా కలెక్టర్ హైమావతి ఆదివారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. నర్మేట దగ్గర బొమ్మకురు నుండి వాటర్ లిఫ్ట్ చేసి రిజర్వాయర్ లో నీరు నింపుతున్నట్లు ఇరిగేషన్ అధికారులు కలెక్టర్ కి తెలిపారు. ముందుగా ప్రాజెక్ట్ ఎఫ్ టి ఎల్ పరిధి పరిశీలించి ప్రాజెక్ట్ భూమిని కబ్జా కాకుండా మానిటర్ చెయ్యాలని అధికారులకు తెలిపారు. అనంతరం కట్టపైన నడుస్తూ వాటర్ లిఫ్ట్ పంపులు, వాటర్ ఓవర్ ఫ్లో సిస్టమ్ ను పరిశీలించారు. రిజర్వాయర్ మెయింటెన్ కట్టపైన చెట్లు తొలగించడం, శుభ్రం చేయడం చెయ్యాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.