అనారోగ్యం తాళలేక మహిళా ఆత్మహత్యాయత్నం అనారోగ్యం తాళలేక విషం తాగి మహిళా ఆత్మహత్యాయత్నానికి పాల్పటి సంఘటన సోమవారం కురబలకోట మండలంలో జరిగింది. మండలంలోని ఎరసానిపల్లికి చెందిన శివమ్మ 50 గత కొన్ని అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమె ఇంట్లో ఉన్న ఫ్లోరైడ్ గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించడంతో కుటుంబీకులు గమనించి ఆమెను వెంటనే మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్సలు అందించి తిరుపతి రుయాకు వెళ్లాలని రెఫర్ చేశారు. మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది